9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నా: బరాక్ ఒబామా
- అల్ ఖైదా చీఫ్ జవహరిని హత మార్చిన అమెరికా
- యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని పెకిలించివేయొచ్చన్న ఒబామా
- ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా యూఎస్ నిఘా వర్గాలు కృషి చేశాయని వ్యాఖ్య
జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఒక్క సాధారణ పౌరుడి ప్రాణానికి కూడా హాని కలగకుండా జవహరిని అంతం చేసినందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా అమెరికా నిఘా వర్గాలు కృషి చేశాయని కొనియాడారు.