Mohan Babu: నా కుమార్తె చిత్రంలో మొట్టమొదటిసారిగా నటిస్తున్నాను... భయంభయంగా ఉంది: మోహన్ బాబు

Mohan Babu shares his look in Agni Nakshatram
  • మంచు లక్ష్మి నిర్మాతగా 'అగ్నినక్షత్రం'
  • ఓ పాత్ర కూడా పోషిస్తున్న మంచు లక్ష్మి
  • ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో చిత్రం
  • ప్రొఫెసర్ విశ్వామిత్రగా మోహన్ బాబు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. తన కుమార్తె మంచు లక్ష్మి నిర్మిస్తున్న 'అగ్నినక్షత్రం' చిత్రంలో ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కూడా నటిస్తుండగా, మొట్టమొదటిసారి కుమార్తె చిత్రంలో నటిస్తున్నానని, భయంభయంగా ఉందని మోహన్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు 'అగ్నినక్షత్రం' చిత్రంలోని తన లుక్ ను కూడా పంచుకున్నారు. 

కాగా, ఈ చిత్రంలో సముద్రఖని, మలయాళ నటుడు సిద్ధిక్ కూడా పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు. వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న 'అగ్నినక్షత్రం' చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. లిజో కే జోషి సంగీతం అందిస్తున్నాడు.
Mohan Babu
Agni Nakshatram
Manchu Lakshmi
Prof Viswamitra

More Telugu News