Kesineni Swetha: అసెంబ్లీ మాజీ స్పీకర్ కాజా రామనాథం మనవడితో ఎంపీ కేశినేని నాని కుమార్తె నిశ్చితార్థం

Kesineni Nani daughter Swetha engagement held at Hyderabad Taj Krishna Hotel
  • హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో నిశ్చితార్థం
  • హాజరైన ప్రముఖులు
  • సతీసమేతంగా విచ్చేసిన నారా లోకేశ్
  • హాజరైన నందమూరి వసుంధర దేవి
హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్ లో టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. శానససభ మాజీ స్పీకర్ కాజా రామనాథం మనవడు రఘుతో కేశినేని నాని కుమార్తె శ్వేతకు నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేశ్, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర దేవి, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

26 ఏళ్ల శ్వేత తండ్రి కేశినేని నాని బాటలో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడలో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. టీడీపీ మేయర్ అభ్యర్థిగానూ బరిలో నిలిచారు. కేశినేని శ్వేత అమెరికాలోని ఎమోరీ వర్సిటీ నుంచి డబుల్ డిగ్రీ (బీఏ ఎకనామిక్స్, బీఏ సైకాలజీ) చేశారు.

 
Kesineni Swetha
Engagement
Raghu
TDP
Hyderabad
Andhra Pradesh

More Telugu News