Tobacco: సిగరెట్, పొగాకు ఉత్పత్తులపై కొత్త 'హెచ్చరిక' ముద్రించాల్సిందే!

Tobacco packs to get new image health warning from December
షార్ట్స్‌లో చూడండి
సిగరెట్ పెట్టెలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరిక కనిపించబోతోంది. దేశీయంగా తయారు చేసే పొగాకు ఉత్పత్తులు, దిగుమతి చేసుకునేవి, లేదా ఇక్కడ ప్యాక్ చేసే పొగాకు ఉత్పత్తులపై డిసెంబర్ 1 నుంచి నూతన ఇమేజ్ తో కూడిన హెచ్చరికను ముద్రించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.  

‘‘ఎంతో బాధతో కూడిన చావుకు పొగాకు కారణమవుతుంది’’ అనే హెచ్చరికతో ప్యాక్ లపై ఫొటోతోపాటు హెచ్చరిక ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ హెచ్చరిక  ఏడాది పాటు అమల్లో ఉంటుందని పేర్కొంది. 

ఇక 2023 డిసెంబర్ 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై (సిగరెట్, గుట్కా తదితర) ‘‘పొగాకు వినియోగంతో చిన్న వయసులోనే చనిపోతారు’’ అనే హెచ్చరికను ముద్రించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త హెచ్చరికలను ఆరోగ్య శాఖ నోటిఫై చేసింది. ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
Go Back to Shorts
Tobacco
packs
new images
new warnings

More Telugu News