CM Jagan: పూడిమడక బీచ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్

CM Jagan express grief on Pudimadaka incident
  • అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన
  • పూడిమడక బీచ్ కు వచ్చిన 15 మంది విద్యార్థులు
  • పలువురు విద్యార్థుల గల్లంతు
  • తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు

అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయ చర్యలు పర్యవేక్షించాలని మంత్రి అమర్ నాథ్ కు నిర్దేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కాగా, పూడిమడక బీచ్ లో గల్లంతైన విద్యార్థుల కోసం కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన జగదీశ్ (గోపాలపట్నం), జస్వంత్ (నర్సీపట్నం), గణేశ్ (మునగపాక), రామచందు (యలమంచిలి), సతీశ్ (గుంటూరు) కోసం గాలిస్తున్నారు. 

ఈ ఘటన నుంచి క్షేమంగా బయటపడిన విద్యార్థులతో జిల్లా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. కాగా, గల్లంతైన వారి కోసం పడవలతో గాలింపు చేపట్టాలని ఎస్పీ మత్స్యకారులను కోరారు.

  • Loading...

More Telugu News