CM Jagan: కేబుల్ ఆపరేటర్లకు ఊరట... పోల్ ట్యాక్స్ రద్దుకు సీఎం జగన్ నిర్ణయం

CM Jagan takes decision on pole tax
  • కేబుల్ ఆపరేటర్లకు భారంగా పోల్ ట్యాక్స్
  • పాదయాత్ర సమయంలో జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఆపరేటర్లు
  • తాజాగా సీఎం హోదాలో సానుకూలంగా స్పందించిన జగన్
  • వెల్లడించిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి
రాష్ట్రంలోని వేలాది మంది కేబుల్ ఆపరేటర్లకు ఊరట కలిగించేలా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ ట్యాక్స్ ను రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 

గతంలో పాదయాత్ర సందర్భంగా కేబుల్ ఆపరేటర్లు పోల్ ట్యాక్స్ ఇబ్బందులను జగన్ దృష్టికి తెచ్చారని, దీనిపై తాజాగా ఆయన సీఎం హోదాలో సానుకూల నిర్ణయం తీసుకున్నారని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఏపీఎస్ఎఫ్ఎల్ ఆధ్వర్యంలో టీవీ చానల్ ను తీసుకువస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ చానల్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతామని వివరించారు.
CM Jagan
Pole Tax
Cable Operators
Andhra Pradesh

More Telugu News