Team India: వెస్టిండీస్ తో తొలి టీ20... టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా

Team India put into batting after WI won the toss in 1st T20
  • బ్రియాన్ లారా స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్
  • 9 ఓవర్లలో భారత్ స్కోరు 2 వికెట్లకు 73 పరుగులు
ఇటీవలే వన్డే సిరీస్ గెలిచి ఊపుమీదున్న టీమిండియా ఇప్పుడు వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు సిద్ధమైంది. నేడు తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య విండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. 

ఓపెనర్ గా బరిలో దిగిన సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 24 పరుగులు చేసి అకీల్ హోసీన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అనంతరం, వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (0) డకౌట్ గా వెనుదిరిగాడు. అయ్యర్ వికెట్ ను ఒబెద్ మెక్ కాయ్ చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ 33, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Team India
Batting
Toss
West Indies
1st T20

More Telugu News