మంచి సినిమా ఉంటే చెప్పండని అడిగావు కదా.. ఈ సినిమా చూడు: కేటీఆర్ కు రాజాసింగ్ సూచన

BJP MLA Raja Singh advices KTR to watch Kashmir Files movie
  • టీఆర్ఎస్ ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారన్న కేటీఆర్
  • బీజేపీ ఎమ్మెల్యేలను మీరు ఒక సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం మర్చిపోయావా? అన్న రాజాసింగ్
  • 'కశ్మీర్ ఫైల్స్' సినిమా చూడాలని సూచన
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. జీఎస్టీపై మాట్లాడేందుకు, పెరుగుతున్న ధరలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తమ ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారని... ఈ రకంగా ట్వీట్ చేసే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు.  'గతం మర్చిపోయావా... మా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం మీరంతా కలిసి సస్పెండ్ చేయలేదా? ఈరోజు మీరు సస్పెన్షన్ గురించి మాట్లాడతారా? మీరందరూ కలిసి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?' అని మండిపడ్డారు. 

కాలికి దెబ్బతగలడంతో ఇంట్లోనే ఉంటున్న కేటీఆర్.. కాలక్షేపానికి ఓటీటీలో మంచి షోలను సూచించాలని అడిగిన సంగతి తెలిసిందే. దీంతో, కేసీఆర్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశంపై రాజా సింగ్ మాట్లాడుతూ, 'కాలు విరిగిందని ఇంట్లో కూర్చున్నావు కదా. మంచి సినిమా ఉంటే చెప్పండని అడిగావు కదా. నేను ఒక సినిమా చెపుతా చూస్కో. 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూడు. లేకపోతే ప్రధాని మోదీ స్పీచ్ కానీ, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి హిస్టరీ కానీ చూడు. మంచి మనిషివి అవుతావ్. నాస్తికుడివైన నీవు ఆస్తికుడివి అవుతావు. నీకు ఇది నా అడ్వైజ్' అని చెప్పారు.
Go Back to Shorts
Raja Singh
BJP
KTR
TRS

More Telugu News