సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటాం: రష్యా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటాం: రష్యా

Russia to build its own Space Station
  • ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాల ఆగ్రహం
  • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకుంటున్నామన్న రష్యా
  • అంతరిక్ష పరిశోధనలకు మాత్రం దూరం కాబోమని వ్యాఖ్య
ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆ దేశాలు ఎన్నో ఆంక్షలను విధించాయి. ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పుకోనున్నట్టు తెలిపింది. అయితే, అంతరిక్ష పరిశోధనలకు మాత్రం దూరం కాబోమని చెప్పింది. ఈ విషయాన్ని రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మాస్ డీజీగా నియమితులైన యూరి బోరిసోవ్ తెలిపారు. కొత్తగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్టు రష్యా తెలిపింది. అయితే, స్పేస్ స్టేషన్ విషయంలో తమ భాగస్వాములకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు.
Russia
International Space Station

More Telugu News