తెలంగాణలో ఇంకాస్త పెరిగిన కరోనా రోజువారీ కేసులు
- గత 24 గంటల్లో 36,619 కరోనా పరీక్షలు
- 795 మందికి పాజిటివ్
- హైదరాబాదులో 343 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 658 మంది
- ఇంకా 4,703 మందికి చికిత్స
అదే సమయంలో 658 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,15,679 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,06,865 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,703 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
