8 నెలల బాబుకు తన పెన్‌ను గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం జగన్.. వీడియో ఇదిగో
- వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
- కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన
- పిల్లాడిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు చేసిన జగన్
- వైరల్ అవుతున్న వీడియో
ఆ బాలుడిని కాసేపు తన చేతుల్లోనే ఉంచుకున్న జగన్... తన జేబులోని పెన్‌ను ఆ బాలుడు తీసుకునే యత్నం గమనించారు. కాసేపటికి ఆ బాలుడిని అతడి తల్లికి అందజేశారు. ఈ సందర్భంగా బాలుడు జగన్ వైపు చూడగా... తన జేబులోని పెన్‌ను తీసిన జగన్... దానిని బాలుడికి అందించారు. జగన్ అందించిన పెన్‌ను తీసుకున్న బాలుడు దానిని నోట్లో పెట్టుకునే యత్నం చేశాడు. ఈ మొత్తం దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.