Babushan Mohanti: నటుడు, నటి... మధ్యలో భార్య... వీడియో చూడండి!

Actor wife assault heroine while she traveled
  • ఒడియా చిత్రపరిశ్రమలో ప్రకృతి మిశ్రా ఫేమస్ హీరోయిన్
  • భూషణ్ మొహంతీతో కలిసి ఓ చిత్రంలో నటించిన వైనం
  • ఇరువురి మధ్య సాన్నిహిత్యం
  • కారులో వెళుతుండగా అడ్డుకున్న నటుడి భార్య
  • ప్రకృతి మిశ్రాపై దాడి
ఒడియా చిత్ర పరిశ్రమలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన భర్తతో నటి ప్రకృతి మిశ్రాకు అక్రమ సంబంధం ఉందంటూ నటుడు భూషణ్ మొహంతీ భార్య తృప్తి సత్పతి వీధికెక్కింది. నటి ప్రకృతి మిశ్రాను చితకబాదింది. నటుడు భూషణ్ మొహంతీ, తృప్తి సత్పతి భార్యాభర్తలు. ప్రకృతి మిశ్రా ఒడియా చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్. ప్రకృతి మిశ్రా, భూషణ్ మొహందీ ఓ చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత మరింత బలపడింది. 

తాజాగా, వారిద్దరూ ఓ కారులో వెళుతున్నారన్న సమాచారంతో తృప్తి సత్పతి వారిని అడ్డుకుంది. కారులో ఉన్న ప్రకృతి మిశ్రాపై దాడి చేసింది. ఆ నటి కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసినా వెంటపడి మరీ కొట్టింది. ఓవైపు ఈ ఉతుకుడు కార్యక్రమం షురూ అవుతుంటే స్థానికులు సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు సందడి చేస్తున్నాయి.
Babushan Mohanti
Prakruti Mishra
Trupti Satpati
Odiya

More Telugu News