Adivi Shesh: నానీని రిక్వెస్ట్ చేశాను: అడివి శేష్

HIT 2 movie update
  • విష్వక్సేన్ హీరోగా వచ్చిన 'హిట్'
  • అడివి శేష్ తో సీక్వెల్ చేస్తున్న నాని
  • కథానాయికగా మీనాక్షి చౌదరి
  • కీలకమైన పాత్రలో భానుచందర్ 
  • వచ్చేనెలలో చివరి షెడ్యూల్ షూటింగ్
నాని నిర్మాతగా విష్వక్సేన్ హీరోగా 2020లో వచ్చిన 'హిట్' సినిమా సక్సెస్ ను సాధించింది. హీరోయిన్ లేకపోయినా కథాపరంగా .. ట్రీట్మెంట్ పరంగా నెట్టుకొచ్చేసింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఆ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ముందుగానే చెప్పారు. ఆ సీక్వెల్ ను అడివి శేష్ హీరోగా రూపొందిస్తున్నారు.

'హిట్ 2' సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. 'మేజర్' ప్రమోషన్స్ లో అడివి శేష్ బిజీగా ఉండటం వలన, ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. 'మేజర్' సక్సెస్ తరువాత కూడా మరికొంత సమయం కావాలని నానీని రిక్వెస్ట్ చేశాననీ, ఇక వచ్చేనెల నుంచి మళ్లీ షూటింగ్ మొదలవుతుందని అన్నాడు. 

వచ్చేనెలలో జరిగే లాస్ట్ షెడ్యూల్ తో చిత్రీకరణ పూర్తవుతుందని శేష్ చెప్పాడు. జాన్ స్టీవర్ట్ సినిమాకి ఈ సంగీతాన్ని  సమకూర్చుతున్నాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో భానుచందర్ .. పోసాని .. రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Adivi Shesh
Sailesh Kolanu
Hit 2 movie

More Telugu News