Mohammad Shami: కోటి రూపాయల జాగ్వార్ కారు కొనుగోలు చేసిన టీమిండియా పేసర్

Team India pacer Mohammad Shami bought new car
  • మహ్మద్ షమీ ఇంటికి కొత్త కారు
  • కూపే మోడల్ స్పోర్ట్స్ కారుపై మోజుపడిన షమీ
  • ధర రూ.98.13 లక్షలు (ఎక్స్ షోరూమ్)
  • ఇటీవలే డెలివరీ ఇచ్చిన జాగ్వార్ ప్రతినిధులు
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఇంటి గ్యారేజీలో కొత్త కారు చేరింది. షమీ ఇటీవలే ఎర్ర రంగు జాగ్వార్ ఎఫ్ టైప్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ఖరీదు రూ.98.13 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది రెండు సీట్ల కూపే మోడల్ కారు. ఇటీవల దీన్ని జాగ్వార్ కంపెనీ ప్రతినిధులు షమీకి డెలివరీ ఇచ్చారు. 

జాగ్వార్ ఎఫ్ టైప్ మోడల్ లో ఇది 2.0 ఆర్-డైనమిక్ వేరియంట్. ఇందులో 2.0 లీటర్ టర్బోచార్జ్ డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. 8 స్పీడ్ జడ్ఎఫ్ ట్రాన్స్మిషన్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ (ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. షమీ ఇటీవలే రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్ ను కూడా కొనుగోలు చేశాడు.
Mohammad Shami
Jaguar
F Type Car
Team India

More Telugu News