సీనియర్ సినీ నటుడు అర్జున్ ఇంట్లో విషాదం

Actor Arjun mother passes away
  • అర్జున్ తల్లి లక్ష్మీదేవమ్మ మృతి
  • బెంగళూరు అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన లక్ష్మీదేవమ్మ
  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అర్జున్ తల్లి
సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగళూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. మైసూర్ లో ఆమె స్కూల్ టీచర్ గా పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆమె భౌతికకాయం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్టు సమాచారం. లక్ష్మిదేవమ్మ మృతి పట్ల కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అర్జున్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు.
Go Back to Shorts
Arjun
Mother
Tollywood

More Telugu News