కొనసాగుతున్న కరోనా జోరు.. లక్షన్నర దాటిన యాక్టివ్ కేసులు!

India reports 21411 fresh cases
భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 21,411 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 20,726 మంది మహమ్మారి నుంచి కోలుకోగా... 67 మంది మృతి చెందారు. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరగడం గమనార్హం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటిపోయింది. ప్రస్తుతం దేశంలో 1,50,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,31,92,379 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,25,997 మంది ప్రాణాలు కోల్పోయారు. 

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా, క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,01,68,14,771 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 34,93,209 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. 


Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News