పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు: సీఐఏ డైరెక్టర్
- తమకు తెలిసినంత వరకు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారన్న బిల్ బర్న్స్
- అధికారిక ప్రకటన కాదని స్పష్టీకరణ
- టెహ్రాన్ పర్యటనలో పుతిన్ అస్వస్థతతో ఉండడంపై వదంతులు
‘‘పుతిన్ ఆరోగ్యంపై ఎన్నో వదంతులు ఉన్నాయి. మా వరకు ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పగలము’’ అని బిల్ బర్న్స్ చెప్పారు. టెహ్రాన్ లో పుతిన్ నడుస్తున్న సందర్భంలో కాస్త బ్యాలన్స్ కోల్పోయారు. ఇది పెద్ద ఎత్తున వదంతులకు తావిచ్చింది. ఇరాన్ పర్యటనలో పుతిన్ జలుబు బారిన పడినట్టు ఇంటర్ ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం సైతం లోగడ పుతిన్ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ప్రకటించడం గమనార్హం.