ద్రౌప‌ది ముర్ముకు మిఠాయి తినిపించిన అమిత్ షా... ఫొటో ఇదిగో

21-07-2022 Thu 21:28
  • భార‌త 15వ రాష్ట్రప‌తిగా ఎన్నికైన ముర్ము
  • ముర్ముకు దేశ‌వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు
  • ముర్ముకు ఇంటికి వ‌చ్చి అభినంద‌న‌లు తెలిపిన అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్
uninon home minister amit shah congratulates draupadi murmu
భార‌త 15వ రాష్ట్రప‌తిగా ఎన్నికైన ద్రౌప‌ది ముర్ముకు దేశ‌వ్యాప్తంగా అన్ని వర్గాలు, పార్టీల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీజేపీ నేత‌ల సంబ‌రాల‌కైతే హ‌ద్దే లేకుండా పోయింది. దేశ‌వ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున సంబ‌రాల‌ను మొద‌లుపెట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని ముర్ము నివాసానికి బీజేపీ అగ్ర నేత‌లు క్యూ క‌ట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాతో క‌లిసి అంద‌రికంటే ముందు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... ముర్ముకు ప్రత్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

అనంతరం, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అక్క‌డికి వ‌చ్చారు. ముర్ముకు అభినంద‌న‌లు తెలిపిన అమిత్ షా... త‌న చేతుల‌తో ఆమెకు మిఠాయి తినిపించారు. ఈ ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. అమిత్ షా అక్క‌డి నుంచి వెళ్లిన కాసేపటికి ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ముర్ము నివాసానికి వ‌చ్చి ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు.