Team India: రేపటి నుంచి వెస్డిండీస్ లో టీమిండియా పర్యటన... అమెరికాలో రెండు మ్యాచ్ లు

Team India tour of West Indies will commence from tomorrow
  • వెస్టిండీస్ పర్యటనకు వచ్చిన టీమిండియా
  • 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్న వైనం
  • రేపు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో తొలివన్డే
  • శిఖర్ ధావన్ నాయకత్వంలో ఆడనున్న టీమిండియా
సీనియర్లకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా రేపటి నుంచి వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. మూడు వన్డేల సిరీస్ తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో రేపు జరగనుంది. మూడు వన్డేలకూ ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా నిలవనుంది. 

ఇక, టీమిండియా, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20లు జరగనుండగా, వీటిలో చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లకు ఫ్లోరిడాలోని లాడర్ హిల్ లో ఉ్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం వేదికగా నిలుస్తుంది. 


పర్యటన వివరాలు...

తొలి వన్డే- జులై 22 (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
రెండో వన్డే- జులై 24 (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
మూడో వన్డే- జులై 27 (పోర్ట్ ఆఫ్ స్పెయిన్)

తొలి టీ20- జులై 29 (తరౌబా)
రెండో టీ20- ఆగస్టు 1 (బాసెటెర్రీ)
మూడో టీ20- ఆగస్టు 2 (బాసెటెర్రీ)
నాలుగో టీ20- ఆగస్టు 6 (ఫ్లోరిడా)
ఐదో టీ20- ఆగస్టు 7 (ఫ్లోరిడా)

వన్డే మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతాయి. టీ20 మ్యాచ్ లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతాయి.
Team India
West Indies
ODI
T20
USA

More Telugu News