Bollywood: పని మనిషితో స్టెరాయిడ్లు ఇప్పించారు.. బాలీవుడ్ మాఫియా నన్ను వేధిస్తోంది: హీరోయిన్ తనుశ్రీ దత్తా

Heroine Tanushree says Bollywood mafia is harassing her
  • తనను టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
  • ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘంగా పోస్టు పెట్టిన బాలీవుడ్ నటి
  • తన బైకు బ్రేకులు తీసేసి ప్రమాదాలు జరిగేలా చేశారని ఆరోపణ
  • ఎవరైనా, ఏదో ఒకటి చేసి తనకు సాయం చేయాలని విజ్ఞప్తి
కొంత మంది వ్యక్తులు తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని.. దీని వెనుక బాలీవుడ్ మాఫియా ఉందని హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేశారు. ఎవరైనా సరే, ఏదో ఒకటి చేసి తనకు సాయం చేయాలంటూ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘంగా పోస్టు పెట్టారు. గతంలో మీటూ వేధింపు సమయంలో తాను ఆరోపణలు చేసినవారే ఇప్పుడు తనను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు.

కొన్ని నెలలు దూరంగా పారిపోయినా..
కొందరు తనను విపరీతంగా వేధిస్తున్నారని.. గతంలో తన సినిమాలు ఆడకుండా కూడా చేశారని తనుశ్రీ దత్తా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో ఆరోపించారు. తన పనిమనిషిని లోబర్చుకుని తనకు వ్యతిరేకంగా వ్యవహరించేలా చేశారని.. ఆమెతో స్టెరాయిడ్లు, కొన్ని రకాల మందులు తనకు పెట్టించారన్నారు. ఈ బాధలు భరించలేక రెండు నెలల కిందట ఉజ్జయినికి పారిపోయానని తెలిపారు. అయినా తనను వదలలేదని.. రెండు సార్లు తన బైకు బ్రేకులు తీసేసి ప్రమాదాలు జరిగేలా చేశారని.. ధైర్యంతో చావు నుంచి బయటపడ్డానని తనుశ్రీ దత్తా పేర్కొన్నారు.

ఆత్మహత్య చేసుకోను.. ఇక్కడే ఉంటా..
తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు ముంబైకి తిరిగి వచ్చానని తనుశ్రీ దత్తా తెలిపారు. తాను ఇక పారిపోబోనని, ఆత్మహత్య వంటివేమీ చేసుకోబోనని.. కష్టపడి తన కెరీర్‌ని తిరిగి నిర్మించుకుంటానని చెప్పారు. తనను ఇబ్బంది పెడుతున్నది బాలీవుడ్‌ మాఫియా అని.. గతంలో తాను మీటూ ఆరోపణలు చేసినవారే దీని వెనుక ఉన్నారని ఆరోపించారు.

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా హిందీ, తెలుగుతోపాటు పలు ఇతర భాషల సినిమాల్లోనూ నటించారు. గతంలో మీటూ ఉద్యమం జరిగినప్పుడు ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
Bollywood
Tanushree datta
Heroine
Me too
Mafia
Instagram
Movie news

More Telugu News