వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్
- ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న స్టోక్స్
- న్యూజిల్యాండ్‌లో పుట్టి ఇంగ్లండ్‌కు వలస వచ్చిన ఆటగాడు
- ఐపీఎల్‌లోనూ రాణించిన ఇంగ్లండ్ క్రికెటర్
న్యూజిల్యాండ్‌లో జన్మించిన బెన్ స్టోక్స్ కుటుంబంతో కలిసి చిన్నతనంలోనే ఇంగ్లండ్ వలస వెళ్లాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న స్టోక్స్ ఆ దేశ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. బ్యాటర్‌గానే కాకుండా బౌలర్‌గానూ రాణించిన స్టోక్స్ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న స్టోక్స్... ఇంగ్లండ్ జట్టుకు 83 టెస్టులు, 101 వన్డేలు ఆడాడు.
బౌలింగ్‌లో మంచి గణాంకాలే నమోదు చేసిన స్టోక్స్ బ్యాటింగ్‌లోనూ రాణించాడు. అంతర్జాతీయంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ మెరిసిన స్టోక్స్...రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్‌లో అతడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. వన్డేలకు గుడ్ బై చెప్పిన టెస్టు క్రికెట్‌లో మరింత కాలం కొనసాగనున్నాడు.
.