లండన్ వీధుల్లో ధోని ఫ్యాన్ మేనియా!... వీడియో ఇదిగో!
- ఇంగ్లండ్ టూర్‌లో కెప్టెన్ కూల్ ధోనీ
- లండన్‌లోని ఓ షాప్ నుంచి వస్తుండగా గుర్తుపట్టిన ఫ్యాన్స్
- భద్రతా సిబ్బంది మధ్య కారెక్కిన ఎంఎస్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
తాజాగా లండన్ వీధుల్లో కనిపించిన ధోనీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. లండన్‌లోని ఓ షాప్‌లో నుంచి బయటకు వస్తున్న ధోనీని గుర్తు పట్టిన అక్కడి క్రికెట్ అభిమానులు ఆతడిని చుట్టుముట్టారు. అయితే అప్పటికే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ధోనీకి రక్షణగా నిలిచి అల్లంత దూరంలో నిలిపి ఉన్న వాహనంలోకి ధోనీని ఎక్కించారు. ఈ సందర్భంగా ధోనీ ఫొటోలు, వీడియోలు తీసేందుకు అక్కడి జనం ఎగబడ్డారు.