ముందస్తు ఎన్నికలు లేవు.. హ్యాట్రిక్ విక్టరీ మాదే: కేటీఆర్
- కేసీఆర్ దొర అయితే ఎందరిని జైల్లో పెట్టారన్నకేటీఆర్
- సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా
- పార్టీలో గొడవలు టీఆర్ఎస్ బలానికి నిదర్శనమన్న మంత్రి
- తనకంటే మెరుగ్గా పనిచేసే మంత్రులున్నారని వ్యాఖ్య
సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పిన కేటీఆర్... ఎన్నికల్లో 90కి పైగా స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా ఉందన్న ఆయన ఈ విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ సర్వేలే చెబుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ను దొర అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్... దొర అయితే కేసీఆర్ ఎంతమందిని జైల్లో పెట్టారని ప్రశ్నించారు.
పార్టీలో కొన్ని చోట్ల గొడవలు ఉన్నాయన్న మాట వాస్తవమేనని అంగీకరించిన కేటీఆర్... అది టీఆర్ఎస్ బలంగా ఉందనడానికి నిదర్శనమని చెప్పారు. కేబినెట్‌లో తనకంటే మెరుగ్గా పనిచేసే మంత్రులు చాలా మంది ఉన్నారని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు.