కాంగ్రెస్ కార్యకర్తలపై చెయ్యేస్తే... ఆ చేయి నరికేస్తాం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- తెలంగాణను కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టేశారన్న కోమటిరెడ్డి
- రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసి కూడా గ్రామాలను అభివృద్ధి చేయలేకపోయారని విమర్శ
- బీజేపీకి గ్రామాల్లో కార్యకర్తలు కూడా లేరని ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై చెయ్యేస్తే ఆ చేయిని నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని... గ్రామస్థాయిలో ఆ పార్టీకి కార్యకర్తలు లేరని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని వెంకటరెడ్డి తెలిపారు.