వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న కేఎల్ రాహుల్-అతియా శెట్టి.. మరో మూడు నెలల్లో పెళ్లి?
- మూడేళ్లకుపైగా డేటింగ్‌లో అతియా-రాహుల్
- అతియా కుటుంబాన్ని కలిసేందుకు ఇటీవల ముంబై వచ్చిన రాహుల్ తల్లిదండ్రులు
- ప్రస్తుతం జర్మనీలో చికిత్స పొందుతున్న రాహుల్
- అక్కడే ఉన్న అతియాశెట్టి
ఈ క్రమంలో అతియా కుటుంబాన్ని కలిసేందుకు రాహుల్ కుటుంబ సభ్యులు ఇటీవలే ముంబై వచ్చారని తెలుస్తోంది. రాహుల్-అతియాలు వారి కుటుంబ సభ్యులతో కలిసి త్వరలో వారు ఉండబోయే కొత్త ఇంటిని సందర్శించారని, వారి పెళ్లి రెండు కుటుంబాలకు గొప్ప వేడుక అవుతుందని అతియా సన్నిహితులు తెలిపారు. పెళ్లికి సంబంధించిన అన్నింటినీ అతియానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
గాయంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన కేఎల్ రాహుల్ చికిత్స కోసం జర్మనీ వెళ్లగా వెంట అతియా కూడా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాహుల్ కోలుకునేందుకు నెల రోజులు పడుతుందని, అప్పటి వరకు అతియా అక్కడే ఉంటుందని సమాచారం. అహాన్ శెట్టి అరంగేట్ర సినిమా తడప్ ప్రీమియర్ సందర్భంగా రాహుల్-అతియాలు తొలిసారి బహిరంగంగా కనిపించారు.