షింజో అబేను బతికించేందుకు డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు: జపాన్ ప్రధాని కిషిదా
- నరా నగరంలో అబేపై కాల్పులు
- కుప్పకూలిన అబే
- ఆసుపత్రిలో అత్యవసర చికిత్స
- పరిస్థితి విషమం
ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న అబేను బతికించేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై తగిన విధంగా స్పందించి చర్యలు తీసుకుంటామని కిషిదా స్పష్టం చేశారు. ఓ ఎన్నిక నేపథ్యంలో అబేపై జరిగిన ఈ దాడి హీనమైన అటవిక చర్య అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య జపాన్ లో ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.