షింజే అబేపై దాడి తీవ్రంగా కలచివేసింది: ప్రధాని మోదీ

Modi reacts to attack on Japan former PM Shinzo Abe
షార్ట్స్‌లో చూడండి
జపాన్ మాజీ ప్రధాని షింజే అబేపై నరా నగరంలో పట్టపగలే కాల్పులు జరగ్గా, ఆయన కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆయన ఇప్పుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియతమ మిత్రుడు షింజే అబేపై దాడి తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా షింజే అబే కుటుంబానికి, జపాన్ ప్రజలకు భారత్ సంఘీభావం ప్రకటిస్తోంది అని వివరించారు.
Go Back to Shorts
Shinzo Abe
Attack
Modi
Japan
India

More Telugu News