జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు.. వీడియో ఇదిగో!
- ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు
- రక్తమోడుతున్న షింజోను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
67 ఏళ్ల షింజే ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టు ఎన్‌హెచ్‌కే అనే మీడియా సంస్థ తెలిపింది. రెండుసార్లు తుపాకి కాల్పుల వంటి శబ్దం వినిపించిందని, ఘటనా స్థలంలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.