ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. మైనర్ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం
- ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
- బహిర్భూమికి వెళ్లిన బాలికలపై అఘాయిత్యానికి తెగబడిన యువకులు
- నిందితులు 19 నుంచి 23 ఏళ్ల లోపు వారన్న పోలీసులు
బాలికలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని వారి తండ్రి గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు 19 నుంచి 23 ఏళ్లలోపు వయసు వారేనని పోలీసులు తెలిపారు. బాధిత బాలికల్లో ఒకరి వయసు 15 ఏళ్లు కాగా, మరో బాలిక వయసు 17 ఏళ్లని పేర్కొన్నారు.