Jagityal: ఇంకా కిడ్నాపర్ల చెరలోనే జగిత్యాల జిల్లా వాసి.. రూ. 15 లక్షల డిమాండ్

kidnappers demand Rs 15 lakh to release Jagityal Man
  • జూన్ 22న ముంబైలో కిడ్నాపైన శంకరయ్య
  • కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఫొటోను పంపిన కిడ్నాపర్లు
  • అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటున్న కుటుంబ సభ్యులు
ముంబైలో జూన్ 22న కిడ్నాపైన జగిత్యాల జిల్లా వాసి మత్తమల్ల శంకరయ్య ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. ఆయనను వదిలిపెట్టేందుకు రూ. 15 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శంకరయ్య కాళ్లు చేతులు కట్టేసి ఉన్న ఫొటోను ఆయన కుమారుడు హరీష్‌కు వాట్సాప్ చేశారు. అంతేకాదు, ఆ డబ్బు మొత్తం ఇవ్వాల్సిందేనని, ఎక్కడికి తెచ్చి ఇస్తారో చెప్పాలని హరీష్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వ్యవసాయం చేసుకుని బతికే తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కాగా, జూన్ 22న ముంబై విమానాశ్రయం నుంచి వస్తున్న సమయంలో శంకరయ్యను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయనను విడిచిపెట్టేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ముంబైలో కేసు నమోదైందని, కిడ్నాపర్లను పట్టుకునేందుకు ఓ బృందాన్ని నియమించినప్పటికీ దర్యాప్తు ముందుకు సాగడం లేదని శంకరయ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Jagityal
Telangana
Mumbai
Kidnap

More Telugu News