అమెరికాలో భారత సంతతి వ్యక్తి కాల్చివేత

Indian origin man shot dead in US
  • క్వీన్స్ లో ఘటన
  • కారులో కూర్చున్న వ్యక్తిపై కాల్పులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇటీవల అమెరికాలోని మేరీ లాండ్ లో సాయిచరణ్ (25) అనే తెలంగాణ యువకుడిని కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. క్వీన్స్ లో సత్నామ్ సింగ్ (31) అనే భారత సంతతి వ్యక్తిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఇక్కడి సౌత్ ఓజోన్ పార్క్ వద్ద అద్దె కారులో కూర్చుని ఉండగా, ఓ సాయుధుడు సత్నామ్ సింగ్ పై కాల్పులు జరిపాడు. ఛాతీ, మెడపై బుల్లెట్ గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

అయితే, చికిత్స పొందుతూ సింగ్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి నివాసానికి కొద్దిదూరంలోనే ఈ కాల్పుల ఘటన జరిగిందని వెల్లడించారు. శనివారం ఈ ఘటన జరిగినట్టు వివరించారు. అయితే, ఆ దుండగుడు సత్నామ్ సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నాడా? లేక, సత్నామ్ సింగ్ అద్దెకు తీసుకున్న కారు యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడా? అనే కోణంలో స్థానిక పోలీసు విభాగం డిటెక్టివ్ లు పరిశోధిస్తున్నారు.
Go Back to Shorts
Satnam Singh
Queens
Shot Dead
Firing
USA

More Telugu News