యూపీ సీఎం యోగికి తప్పిన ముప్పు.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
- యోగా హెలికాప్టర్ ను ఢీ కొట్టిన పక్షి
- వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్
- యోగి లక్నో వెళ్తుండగా ఘటన
హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా కిందకు దించాడు. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత సీఎం యోగి సర్క్యూట్ హౌస్ కి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి లక్నో వెళ్లేందుకు అధికారులు ప్రభుత్వ విమానం ఏర్పాటు చేశారు. బాబట్ పూర్ విమానాశ్రయం నుంచి ఈ విమానం బయల్దేరనుంది. ప్రస్తుతం రోడ్డు మార్గాన యోగి బాబట్ పూర్ విమానాశ్రయానికి వెళ్లారు.