Telangana: 'సాలు దొర‌.. సెల‌వు దొర' పేరిట‌ టీఆర్ఎస్ పాల‌న‌పై బీజేపీ వెబ్‌సైట్

tarun chugh harsh comments on kcr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో టీఆర్ఎస్ పాల‌న‌పై సాలు దొర‌.. సెల‌వు దొర పేరిట వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న‌ట్లు బీజేపీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ త‌రుణ్ చుగ్ ప్ర‌క‌టించారు. ఈ వెబ్ సైట్ ద్వారా కేసీఆర్ గ‌ద్దె దిగు... బీజేపీ పాల‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న విష‌యాన్ని టీఆర్ఎస్‌కు నిత్యం గుర్తు చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ పాల‌న‌పై శ‌నివారం త‌రుణ్ చుగ్ నిప్పులు చెరిగారు. 

కేసీఆర్ కుటుంబం క‌బంధ హ‌స్తాల్లో తెలంగాణ బందీ అయిపోయింద‌ని చుగ్ ఆరోపించారు. తెలంగాణ‌లో కేసీఆర్, ఆయ‌న కుటుంబ సభ్యులు మాత్ర‌మే పెత్త‌నం చెలాయిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. కేసీఆర్‌, ఆయ‌న కేబినెట్ మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలీబాబా 40 దొంగ‌ల మాదిరిగా తెలంగాణ‌ను దోచుకుంటున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ స‌ర్కారుకు కౌంట్ డౌన్ ప్రారంభ‌మైంద‌ని త‌రుణ్ చుగ్ చెప్పారు.
Go Back to Shorts
Telangana
BJP
TRS
KCR
Tarun Chugh

More Telugu News