ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఏనుగు' సెన్సార్ పనులు పూర్తి

25-06-2022 Sat 18:49 | Both States
  • అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా 'ఏనుగు'
  • సింగం ఫేమ్ హరి దర్శకత్వం
  • U/A సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు
  • జులై 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ 
Enugu completes censor work
తమిళ నటుడు అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన 'ఏనుగు' చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నిర్మాణం జరుపుకున్న 'ఏనుగు' చిత్రానికి 'సింగం' ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. 

తెలుగు, తమిళ భాషల్లో ఈ భారీ చిత్రం జులై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.