'అంగరంగ వైభవంగా' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
- గిరీశాయ నుంచి మరో ప్రేమకథా చిత్రం
- వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 27వ తేదీన టీజర్ ను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.
వైష్ణవ్ తేజ్ కి ఇది మూడో సినిమా .. అలా కేతిక శర్మకి కూడా ఇది మూడో సినిమానే. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి. కేతిక శర్మ ఇంతకుముందు చేసిన రెండు సినిమాలూ పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా సక్సెస్ ఆమెకి కీలకంగా మారింది.