YSRCP: అధికార మదంతో వ్య‌వ‌హరిస్తే జ‌నం వాత పెడ‌తారు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి

ysrcp mla kotamreddy sridhar reddy suggestions to his own party cadre
  • నెల్లూరులో వైసీపీ నియోజ‌కవ‌ర్గ ప్లీన‌రీ
  • విప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌ను వేధించొద్ద‌న్న కోటంరెడ్డి
  • రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు‌గా మాత్ర‌మే విప‌క్షాల‌ను చూడాల‌ని విన‌తి
విప‌క్షాల‌కు చెందిన నేత‌లు, కార్య‌కర్త‌లను వేధించ‌వ‌ద్ద‌ని వైసీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తున్న కోటంరెడ్డి శ‌నివారం నెల్లూరులో నిర్వ‌హించిన నియోజ‌క‌వర్గ స్థాయి ప్లీన‌రీలో ఈ వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాల‌ని కూడా ఆయ‌న వైసీపీ శ్రేణుల‌కు సూచించారు. 

అధికార మ‌దంతో ప్ర‌వ‌ర్తిస్తే జ‌నం వాత పెడ‌తార‌ని కూడా కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించే వారికి ఎక్క‌డ వాత పెట్టాలో జ‌నానికి తెలుస‌న్న కోటంరెడ్డి... ఆ వాత‌ల‌ను ఎప్పుడు పెట్టాలో కూడా జ‌నానికి బాగానే తెలుసు అని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
YSRCP
Andhra Pradesh
Nellore District
Kotamreddy Sridhar Reddy

More Telugu News