అసభ్య చిత్రాలు పంపిన పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు: చిన్మయి శ్రీపాద
- మీటూ ఉద్యమానికి ప్రోత్సాహం అందించిన చిన్మయి
- అప్పట్లో తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు
- మరోసారి వార్తల్లోకెక్కిన చిన్మయి
- వేధిస్తున్న వారి అకౌంట్లు ఉంచారని వెల్లడి
- తన అకౌంట్ తొలగించారని ఆవేదన
ఇది కొన్నాళ్లుగా జరుగుతోందని, దీనిపై ఫిర్యాదు చేయగానే, తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ప్రాథమికంగా సస్పెండ్ చేశారని చిన్మయి పేర్కొన్నారు. ప్రస్తుతం chinmayai.sripada అనే బ్యాకప్ అకౌంట్ తో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలిపారు. ఈ తాత్కాలిక అకౌంట్ ద్వారా చిన్మయి తన ఆవేదన వెలిబుచ్చారు. వేధింపులకు పాల్పడుతున్నవారి అకౌంట్లు అలాగే ఉంచి, ఎలుగెత్తిన వారి అకౌంట్ ను తొలగించారని ఆక్రోశించారు. చిన్మయి శ్రీపాద ఇటీవల కవలలకు జన్మనివ్వడం తెలిసిందే.