'కేజీఎఫ్' హీరోయిన్ కి సమస్య అదేనట!

  • 'కేజీఎఫ్' హీరోయిన్ గా శ్రీనిధి శెట్టికి క్రేజ్  
  • యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్
  • పారితోషికం విషయంలో తగ్గని శ్రీనిధి 
  •  ఆ కారణంగా చేజారిపోతున్న అవకాశాలు
Srindhi Shetty Special

హీరోకి ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఒక భాషకి చెందిన సినిమాలనే చేసుకుంటూ వెళ్లవలసి వస్తుంది. అదే హీరోయిన్స్ అయితే ఓ అరడజను భాషల్లో ప్రాజెక్టులను చుట్టబెట్టేస్తూ ఉంటారు. ఒక సినిమా హిట్ అయితే చకచకా నాలుగు వైపులా నుంచి అవకాశాలు వస్తుంటాయి. దాంతో ఆ డిమాండ్ కి తగినట్టుగానే వీళ్లు పారితోషికాన్ని పెంచేస్తూ ఉంటారు.
 
'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా ఆ సినిమా తరువాత పారితోషికం పెంచింది. ఇటీవల వచ్చిన 'కేజీఎఫ్ 2' కూడా సంచలన విజయాన్ని సాధించడంతో పారితోషికాన్ని మరింత పెంచిందట. ఇంతవరకూ ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువ. 'కేజీఎఫ్' హిట్ లో ఆమె పాత్ర కూడా చాలా తక్కువే. అయినా ఆమె తన పారితోషికాన్ని ఒక రేంజ్ లో పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. 

కొత్త ప్రాజెక్టులలో ఆమె కనిపించకపోవడానికి కారణం ఇదేననే టాక్ శాండల్ ఉడ్ లో వినిపిస్తోంది. శ్రీనిధి శెట్టి మంచి పొడగరి .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. ప్రభాస్ .. మహేశ్ వంటి హీరోల సరసన ఆమెను చూడాలని అభిమానులు ఆశపడుతుంటే,  ఆమె మాత్రం పారితోషికం విషయంలో దిగిరావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News