సరయూ నదిలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు.. చితకబాదేసిన జనం: వీడియో వైరల్
- ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఘటన
- అయోధ్యలో అలాంటివి కూడదంటూ దాడిచేసిన జనం
- వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు
- నిందితులపై చర్యలు తప్పవని హెచ్చరిక
అయోధ్యలో ఇలాంటి వాటిని సహించబోమంటూ మూకుమ్మడిగా దాడిచేశారు. నది నుంచి బయటకు లాక్కుంటూ దాడి చేశారు. భార్య అడ్డం పడుతున్నా ఆగలేదు సరికదా, తిడుతూ అతడిని కొడుతూనే ఉన్నారు. ఓ వ్యక్తి మాత్రం వారిని అడ్డుకుని ఆ జంటను బయటకు పంపాడు. ఈ ఘటన మొత్తాన్ని ఎవరో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అది తిరిగి తిరిగి పోలీసుల దృష్టిలో పడడంతో స్పందించిన పోలీసులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.