Mehreen: పేరొస్తే డబ్బొస్తుంది... కానీ డబ్బుతో పేరును కొనుక్కోలేం: మెహ్రీన్

Mehreen opines in chit chat
  • ఎఫ్3తో మరో హిట్ కొట్టిన మెహ్రీన్
  • తాజా చిట్ చాట్ లో ఆసక్తికర అంశాల వెల్లడి
  • మనల్ని మనం ప్రేమించుకోవడం ముఖ్యమని స్పష్టీకరణ
  • ఆనందకర జీవితానికి అదే సోపానమని వివరణ

ఇటీవల కాస్త స్లిమ్ గా తయారైన అందాలభామ మెహ్రీన్ పీర్జాదా ఎఫ్3తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ అభిమానులు అలరించేందుకు సదా సిద్ధం అంటోంది. తాజాగా ఓ చిట్ చాట్ లో మెహ్రీన్ ఆసక్తికర అంశాలను పంచుకుంది. జీవితంలో మనల్ని మనం ప్రేమించడం చాలా ముఖ్యమని, ఆనందమయ జీవితానికి అదే సోపానం అని పేర్కొంది. 

ప్రేమ, స్నేహం వేర్వేరు కాదని వెల్లడించింది. మనం ప్రేమించే వ్యక్తి మంచి స్నేహితుడు అయినప్పుడే సరైన అవగాహన ఏర్పడుతుందని పేర్కొంది. కాబోయే భాగస్వామిలో నమ్మకం, ప్రేమ, అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంటే చాలని మెహ్రీన్ అభిప్రాయపడింది. 

డేటింగ్ అంటే ప్రత్యేకంగా ఇదీ అని చెప్పలేమని, ఇరువురు ఇష్టపడి ఓ సినిమాకు వెళ్లినా, ఓ డిన్నర్ కు వెళ్లినా అది పర్ఫెక్ట్ డేటింగ్ అవుతుందని సెలవిచ్చింది. పేరు కావాలా, లేక డబ్బు కావాలా అంటే.... పేరొస్తే డబ్బు వస్తుందని, కానీ డబ్బుతో పేరును కొనుక్కోలేమని తెలిపింది.

  • Loading...

More Telugu News