రూ.5 లక్షల విలువైన నగలను డ్రైనేజి పాలుచేసిన ఎలుకలు... ఎట్టకేలకు యజమానికి అప్పగించిన పోలీసులు
- ముంబయిలో ఘటన
- నగలు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు బయల్దేరిన మహిళ
- వడా పావ్ సంచి అనుకుని నగల సంచి చిన్నారులకు ఇచ్చిన వైనం
- ఆ సంచిని చెత్తకుండీలో వేసిన చిన్నారులు
- ఆ సంచిని డ్రైనేజీలోకి లాక్కెళ్లిన మూషికాలు
అయితే, తాను చిన్నారులకు సంచి ఇచ్చిన ప్రాంతానికి వెళ్లి చూడగా, అక్కడ ఆ చిన్నారులు కనిపించలేదు. దాంతో సుందరి ప్లానిబేల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎట్టకేలకు చిన్నారుల ఆచూకీ కనుగొన్నారు. వారిని ప్రశ్నించగా, వడా పావ్ తినాలని అనిపించకపోవడంతో ఆ సంచిని చెత్తకుండీలో విసిరేశామని చెప్పారు. పోలీసులు వెంటనే ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. ఆ చెత్తకుండీలోంచి నగల సంచీని కొన్ని ఎలుకలు పక్కనే ఉన్న డ్రైనేజీలోకి తీసుకెళ్లడం కనిపించింది. వెంటనే ఆ కాలువ నుంచి నగల సంచిని వెలికి తీసి సుందరి ప్లానిబేల్ కు అందజేశారు.