తిరుపతిలో మ్యాన్ హోల్ ప్రమాదంపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేశ్
- ఘటనపై నివేదిక కోరిన మంత్రి ఆదిమూలపు సురేశ్
- అధికారుల నిర్లక్ష్యం ఉంటే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరిక
- మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడినట్టు తేలితే కఠినచర్యలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.