కార్బ‌న్ మోనాక్సైడ్ పీల్చి లేడీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Fashion designer Pratyusha Garimella commits suicide
  • త‌న ఇంటిలోని బాత్ రూమ్‌లో విగ‌త జీవిగా ప్ర‌త్యూష‌
  • కుటుంబ స‌భ్యుల స‌మాచారంతో పోలీసు కేసు న‌మోదు
  • ప్ర‌త్యూష గ‌ది‌లో కార్బ‌న్ మోనాక్సైడ్ బాటిల్ స్వాధీనం
  • ఈ వాయువు పీల్చే ప్ర‌త్యూష చ‌నిపోయింద‌ని అనుమానం
 హైద‌రాబాద్‌లో శ‌నివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ప్యాష‌న్ డిజైనింగ్ రంగంలో స‌త్తా చాటుతున్న ప్ర‌త్యూష గ‌రిమెళ్ల త‌న ఇంటిలోనే ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. డిప్రెష‌న్‌కు గురైన నేప‌థ్యంలోనే ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఆత్మ‌హ‌త్యకు సంబంధించి ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. కార్బ‌న్ మోనాక్సైడ్‌ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్ర‌త్యూష ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేర‌కు ఆమె గ‌దిలో కార్బ‌న్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు క‌నుగొన్నారు. త‌న ఇంటిలోని బాత్ రూమ్‌లో ప్ర‌త్యూష విగ‌త జీవిగా ప‌డి ఉన్న విష‌యాన్ని గుర్తించిన ఆమె కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ప్రాథ‌మిక ఆధారాలు సేక‌రించి ప్ర‌త్యూష మృత‌దేహాన్ని ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
Go Back to Shorts
Pratyusha Garimella
Crime News
Hyderabad
Hyderabad Police
Suicide

More Telugu News