Roja: మంత్రి రోజా వ్యాఖ్యలకు ప్రతి కౌంటర్ ఇచ్చిన టీవీ5 న్యూస్ చానల్

TV5 news channel counters minister Roja allegations
  • తిరుమలలో మహాద్వార దర్శనం చేసుకున్న రోజా
  • టీవీ5 చానల్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం
  • తన వాళ్లు తప్పులు చేయరని పేర్కొన్న మంత్రి 
  • విజువల్స్ ప్రసారం చేసిన టీవీ5 చానల్
  • రోజా ఎస్కార్ట్ డ్రైవర్ మహాద్వారం నుంచి వచ్చాడని వెల్లడి
తాను తిరుమలలో మంత్రి హోదాలో మహాద్వార దర్శనం చేసుకుంటే, తన సిబ్బంది కూడా గుడిలోకి వచ్చారంటూ టీవీ5 చానల్ దుష్ప్రచారం చేస్తోందని రోజా మండిపడిన సంగతి తెలిసిందే. వెళ్లి బాబు భజన చేసుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, మంత్రి రోజా ఆరోపణలపై టీవీ5 చానల్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. రోజా తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రత్యారోపణలు చేసింది. 

ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోకి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ కూడా ప్రవేశించిన దృశ్యాలను టీవీ5 ప్రసారం చేసింది. మహాద్వారం నుంచి ఎస్కార్ట్ డ్రైవర్ ఆలయంలోకి ప్రవేశించడంపై టీటీడీ దృష్టి సారించిందని, రోజా డ్రైవర్ ను టీటీడీ విజిలెన్స్ వర్గాలు విచారిస్తున్నాయని టీవీ5 చానల్ పేర్కొంది. సంప్రదాయ దుస్తులు లేకుండానే ఆ డ్రైవర్ ఆలయంలోకి ప్రవేశించినట్టు వెల్లడించింది.
Roja
TV5
News Channel
Tirumala

More Telugu News