KTR: భుజాలు త‌డుముకోవ‌డం అంటే ఇదేనేమో!: కేటీఆర్‌పై ర‌ఘునంద‌న్ సెటైర్‌!

bjp mla raghunandan rao satiricalreply toktr tweet
  • ద‌ర్యాప్తు సంస్థ‌ల దాడుల‌పై కేటీఆర్ ట్వీట్‌
  • కేటీఆర్ ట్వీట్ ఆంత‌ర్యం ఏమిటన్న రఘునందన్ 
  • ద‌ర్యాప్తు సంస్థ‌లంటే భ‌య‌మెందుకని ప్రశ్న 
విప‌క్షాల‌పై రాజ‌కీయ దురుద్దేశాల‌తోనే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయిస్తున్నార‌ని, మ‌రి 8 ఏళ్ల కాలంలో బీజేపీ నేత‌లు ఎంత‌మందిపై ఈ దాడులు జ‌రిగాయ‌ని ప్ర‌శ్నిస్తూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నేత‌, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఘాటుగా స్పందించారు. గుమ్మ‌డి కాయ‌ల దొంగ అంటే భుజాలు త‌డుముకోవ‌డం అంటే ఇదేనేమోనంటూ ర‌ఘునంద‌న్ రావు ఓ సెటైరిక‌ల్ ట్వీట్ సంధించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల‌పై కేటీఆర్ శ‌నివారం ఉద‌యం ట్వీట్ చేస్తే... దానిపై ర‌ఘునంద‌న్ రావు మ‌ధ్యాహ్నం స్పందించారు. కేటీఆర్ ట్వీట్‌లోని ఆంతర్యం ఏమిటోనంటూ ప్ర‌శ్నించిన ర‌ఘునంద‌న్ రావు... ద‌ర్యాప్తు సంస్థ‌లు అంటే ఎందుకు ఉలికిప‌డుతున్నారో అర్థం కావ‌డం లేద‌ని నిల‌దీశారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోడం అంటే ఇదేనేమోన‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.
KTR
TRS
BJP
Raghunandan Rao
Dubbak MLA
Twitter

More Telugu News