టీడీపీ నేత గౌతు శిరీషకు మళ్లీ సీఐడీ నోటీసులు... ఈ నెల 20న విచారణకు రావాలంటూ ఆదేశం
- ఇదివరకే ఓ దఫా విచారించిన సీఐడీ
- తాజాగా రెండో సారి విచారణకు నోటీసులు
- గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశం
ఇదిలా ఉంటే... ఇదే కేసులో నాలుగు రోజుల క్రితం సీఐడీ విచారణకు గౌతు శిరీష హాజరైన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగంలో ఆమెను దాదాపుగా 7 గంటల పాటు సీఐడీ అధికారులు విచారించారు. ఈ విచారణ సందర్భంగా అధికారులు తనకు మధ్యాహ్న భోజనం పెట్టలేదని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని శిరీష ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నేరం ఒప్పుకుంటున్నట్లు తనతో సంతకం చేయించేందుకు సీఐడీ అధికారులు యత్నించారని, అయితే తాను మాత్రం అందుకు ఒప్పుకోలేదని శిరీష చెప్పారు.