Rashmika Mandanna: ఆ బాలీవుడ్ హీరో మాత్రమే నన్ను మేడమ్ అని పిలుస్తాడు: రష్మిక

Ranbir Kapoor calls me as madam says Rashmika Mandanna
  • బాలీవుడ్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్న రష్మిక  
  • ఇప్పటికే రెండు హిందీ సినిమాల షూటింగ్ ను పూర్తి చేసుకున్న ముద్దుగుమ్మ
  • ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన మరో చిత్రంలో నటిస్తున్న రష్మిక
తెలుగు, తమిళంలో పలు హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక మందన్న అగ్రహీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇప్పుడు హిందీలో కూడా ఆమె బిజీ అయింది. ఇప్పటికే రెండు బాలీవుడ్ సినిమాల షూటింగ్ లను పూర్తి చేసుకుంది. తాజాగా సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్న 'యానిమల్' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను తాజాగా రష్మిక పంచుకుంది. 

రణబీర్ కపూర్ చాలా మంచి వ్యక్తి అని... అయితే ఆయనను తొలిసారి కలిసినప్పుడు చాలా నెర్వస్ గా అనిపించిందని రష్మిక తెలిపింది. అయితే కలిసిన ఐదు నిమిషాలకే ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పింది. సినీ పరిశ్రమలో రణబీర్ ఒక్కడు మాత్రమే తనను మేడమ్ అని పిలుస్తాడని తెలిపింది. రణబీర్, సందీప్ లతో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది.
Rashmika Mandanna
Ranbir Kapoor
Bollywood
Tollywood

More Telugu News