AIMPLB: టీవీ చానల్ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దు... మత పెద్దలకు ఆదేశాలు జారీ చేసిన ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు

AIMPLB issues directives to muslim scholars and ulemas
  • ఇటీవల మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు
  • మూల్యం చెల్లించుకున్న నుపుర్ శర్మ, నవీన్ జిందాల్
  • దేశవ్యాప్తంగా నిరసనలు
  • ప్రకటన విడుదల చేసిన ముస్లిం పర్సనల్ లా బోర్డు
ఇటీవల ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు చేసిన ఫలితంగా నుపుర్, నవీన్ జిందాల్ బీజేపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ముస్లిం పండితులు, మౌల్వీలు టీవీ చానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. చానల్ డిబేట్లకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఉర్దూ, హిందీ భాషల్లో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సున్నితమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలున్నట్టు ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది.
AIMPLB
Debats
Muslim Scholars
Ulemas
TV
India

More Telugu News