ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్‌పై హైదరాబాద్ కలెక్టర్ కు ఎన్‌సీపీసీఆర్ నోటీసులు
- ఆమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్‌పై ఎన్‌సీపీసీఆర్ దృష్టి
- సమగ్ర వివరాలు పంపాలంటూ హైదరాబాద్ కలెక్టర్‌కు నోటీసులు
- గ్యాంగ్ రేప్ వివరాల కోసం జూబ్లీ హిల్స్ పోలీసులకు కలెక్టర్ లేఖ
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్‌సీపీసీఆర్) శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు పంపింది. గ్యాంగ్ రేప్‌నకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలంటూ సదరు నోటీసుల్లో కలెక్టర్‌ను ఆ సంస్థ కోరింది. ఎన్‌సీపీసీఆర్ నుంచి నోటీసులు అందుకున్న కలెక్టర్... ఈ ఘటనపై సమగ్ర వివరాలు అందజేయాలంటూ జూబ్లీ హిల్స్ పోలీసులకు లేఖ రాశారు. పోలీసుల నుంచి వివరాలు అందగానే...కలెక్టర్ వాటిని ఎన్‌సీపీసీఆర్ కు నివేదించనున్నారు.