Deepika Padukone: తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న దీపికా పదుకొణె

Deepika Padukone accompanies father Prakash Padukone to Tirupati temple on his birthday
  • దీపిక తండ్రి ప్రకాష్ పదుకొణె 67వ పుట్టినరోజు నేడు
  • తండ్రి, సోదరితో కలసి తిరుమలకు వచ్చిన దీపిక
  • ఫొటోలను 'లైవ్ లవ్ దీపిక' అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వైనం  
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె శుక్రవారం తిరుమలలో తళుక్కుమంది. తన తండ్రి, బ్యాడ్మింటన్ మాజీ ఛాంపియన్ ప్రకాష్ పదుకొణెతో కలసి ఆమె తిరుమలకు వచ్చింది. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకుంది. ప్రకాష్ పదుకొణె 67వ పుట్టిన రోజు కావడంతో స్వామి దర్శనానికి వారు విచ్చేశారు. 

దర్శనం తర్వాత ఆలయం ముందు భాగంలో మాస్క్ ధరించి దీపికా కెమెరా కళ్లకు చిక్కింది. దీపిక వెంట తండ్రితోపాటు సోదరి అనీష పదుకొణె కూడా ఉంది. ఈ ఫొటోలను ఆమె లైవ్ లవ్ దీపిక అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

దీపిక చివరిసారిగా తన మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమలకు వచ్చింది. అప్పుడు ఆమె వెంట భర్త రణవీర్ సింగ్ కూడా ఉన్నారు. ఇటీవలే కేన్స్ ఫెస్టివల్ లో దీపిక పెద్ద సందడి చేసి రావడం తెలిసిందే.
Deepika Padukone
Tirupati temple
Prakash Padukone
birth day
srivari darsanam

More Telugu News